in

iron leg ramya krishna nu star heroine ga marchina raghavendra rao!

మిళ పరిశ్రమకి చెందిన సినీ విమర్శకులు రామస్వామి మేనకోడలే నటి రమ్యకృష్ణ. చిత్రరంగ ప్రవేశం ఎలాంటి ఇబ్బందులు లేకుండానే జరిగింది సక్సెస్ అనే మాట వినడానికి మాత్రం ఆమెకి చాలా సంవత్సరాలే పట్టింది. 1985లో భలేమిత్రులు సినిమాతో టాలీవుడ్‌‌కి ఎంట్రీ ఇచ్చింది రమ్యకృష్ణ.. ఈ సినిమా తరవాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకి నటిగా మాత్రం గుర్తింపు రాలేదు. పైగా వరుసగా ఆమె చేసిన సినిమాలు పరాజయం పాలవ్వడంతో ఆమెకి ఇండస్ట్రీలో ఐరెన్‌‌లెగ్ అనే ముద్ర పడిపోయింది..దీనితో ఆమెకి ఓ అయిదారు సంవత్సరాల వరకు పెద్దగా అవకాశాలు రాలేదు.

కానీ ఆమె సినీ లైఫ్‌‌ని టర్న్ చేసింది మాత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అయన దర్శకత్వంలో మోహన్‌‌బాబు హీరోగా 1992లో వచ్చిన అల్లుడుగారు సినిమా రమ్యకృష్ణకి మొదటి సక్సెస్.. సినిమా వంద రోజుల ఫంక్షన్ లో రమ్యకృష్ణ మాట్లాడుతూ ఎమోషనల్ కూడా అయ్యారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత మళ్ళీ రమ్యకృష్ణ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందరు ఆమెను ఐరెన్‌‌లెగ్ అన్నప్పటికీ ఆమెలోని నటిని మాత్రమే చూశారు రాఘవేంద్రరావు. ఆ తర్వాత రాఘవేంద్రరావుతో ఎక్కువ సినిమాలు చేసింది రమ్యకృష్ణ.. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా దాదాపుగా హిట్ అయింది..

17 years for AA Naluguru!

pooja hegde reveals her difficulties about getting married!