ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మరాక్షస్ ని వర్కింగ్ టైటిల్ గా అనుకొంటున్నారు. రణవీర్ సింగ్ చేయాల్సిన కథ ఇది. అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ చేతికి చేరింది. ప్రభాస్ తో ఓ సినిమా చేయబోతున్నా అని ప్రశాంత్ వర్మ ఎప్పుడో హింట్ ఇచ్చేశాడు. కానీ ఆ తరవాత అంతా సైలెంట్ అయిపోయింది. దాంతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి..
ప్రశాంత్ వర్మ కూడా చాలా కాలంగా సైలెంట్ గా ఉన్నాడు. కానీ ఈ గ్యాప్ లో ‘బ్రహ్మరాక్షస్’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేశాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ సీన్, ప్రతీ షాట్.. ప్రీ విజువలైజేషన్ చేయించేశాడు. ఇప్పుడు తన దగ్గర స్క్రిప్టు ప్రీ విజువలైజేషన్ రూపంలో పక్కాగా ఉంది. ఏ షాట్ ఎలా తీయాలి? అనేది ముందే డిసైడ్ చేసేశాడు. దీని వల్ల మేకింగ్ లో సమయం ఆదా అవుతుంది. సెట్ కి వెళ్లి ఏం చేయాలి? ఎలా తీయాలి? అనేది ఆలోచించకుండా ముందే..సినిమా ప్రీ ప్రొడక్షన్ లోనే చూసేసుకొంటరన్నమాట..!!