in

Interesting Titles In Consideration For Nani-Mrunal Thakur’s movie!

సరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాని, తన 30వ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగును చాలా ఫాస్టుగా కానిచ్చేస్తున్నారు. మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో, శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా అలరించనుంది. ఇది తండ్రీ ..తన గారాల కూతురుకి సంబంధించిన కథ. ఈ రెండు పాత్రల మధ్య చోటుచేసుకునే ఎమోషన్స్ తో కూడిన కథ. అలాంటి ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు.

చాలా టైటిల్స్ ను పరిశీలించారు. వాటిలో ఒక మూడు టైటిల్స్ ను ముందు వరుసలో నిలబెట్టారు.  ఆ జాబితాలో హలో డాడీ ..హలో నాన్న ..హాయ్ నాన్న అనే టైటిల్స్ కనిపిస్తున్నాయి. ఈ మూడు టైటిల్స్ లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హేషం అబ్దుల్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. టైటిల్ ను సెట్ చేసిన తరువాత నుంచి ప్రమోషన్స్ మొదలెట్టనున్నారు..!!

Man Snatches Mobile Phone From Rashmika Mandanna’s Hand!

DJ Tillu fame Siddhu says no to Megastar Chiranjeevi!