ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక హీరో ,హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం “పుష్ప”. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పుష్ప ఎంత హిట్ అయిందో అందులో పాటలు కూడా అంతే పెద్ద హిట్ అయ్యాయి. ఇక సమంత నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా.. మావ ఊఊ అంటావా” అయిటే యూట్యూబ్‌ను షేక్ చేసింది..
అయితే ఈ ఐటమ్ సాంగ్‌ను సింగర్ మంగ్లీ సోదరి సింగర్ ఇంద్రావతి చౌహాన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటకు గాను ఆమె బిహైండ్‌వుండ్ వారి గోల్డ్ మెడల్‌ను అందుకోనుంది. ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ బిహైండ్‌వుడ్ సంస్థ ఈ ఏడాది 19 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సంస్థ యానివర్సరి సెలెబ్రెషన్స్‌లో భాగంగా మే 22న ఈ ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాలు, ఉత్తమ నటులు, సింగర్స్‌కు గోల్డ్ మెడల్స్‌ను ప్రదానం చేయనుంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది బిహైండ్‌వుడ్ గోల్డ్ మెడల్ ప్రదానోత్సవానికి ఆమెను ఎంపిక చేశారు. ఈ విషయాన్నిఇంద్రావతి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ‘నిజంగా నేను ఆశీర్వాదించబడ్డాను. మే 22 ఊ అంటావా.. ఊఊ అంటావా పాటకు గోల్డ్ మెడల్ తీసుకోబోతున్నాను. బెస్ట్ థింగ్స్ ఎప్పుడు ఊహించకుండానే వస్తాయి. నాకు ఈ గుర్తింపు రావడానికి కారణంగా దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయనకు నేను ఎప్పటికి కృతజ్ఞురాలిని. థ్యాంక్యూ సార్. ఇది నిజంగా గర్వించే విషయం’ అంటూ రాసుకొచ్చింది.