కొన్ని వార్తలు కామెడీగా ఉంటాయని, అసలు అలాంటి న్యూస్ ఎలా వస్తుందో కూడా తెలియదని నవ్వేసింది. తాను ప్రెగ్నెంట్ అని, ఈ విషయం బయటకు రాకుండా అబార్షన్ కూడా చేయించుకున్నానని వచ్చిన ఫేక్ న్యూస్‌పై ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియలేదని చెప్పింది..ఇక మరోసారి ‘ఇలియానా ఆత్మహత్యకు ప్రయత్నించింది.. కానీ ప్రాణాలతో బయటపడింది.. ఈ విషయాన్ని పని మనిషి ధృవీకరించింది’ అనే న్యూస్ చూసి షాక్ అయ్యానని తెలిపింది.
‘అసలు తనకు పనిమనిషే లేదు.. సూసైడ్ అటెంప్ట్ చేయలేదు.. తాను బతికే ఉన్నాను’ అని ఎలా చెప్పుకోవాలి అంటూ నవ్వేసింది ఇల్లీ బేబి. ఈ క్రమంలోనే 2018లో ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో ఫస్ట్ చైల్డ్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందని వార్తలు రాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌తో ఈ రూమర్స్‌ను ఖండించిందని, తాను గర్భవతి కాదని చెప్పిందని న్యూస్ రాశారని వివరించింది. అయితే మరీ ఇంత వింతగా వార్తలు ఎలా రాస్తారో అర్థం కాదంది ఇల్లీ బేబి.