in

Idharu top directors madhayalo young hero!

మైసూరు శేషయ్య సురేష్ నాయుడు, సురేష్ గ తెలుగు, తమిళ చిత్ర రంగం లో  సుపరిచితుడు,సురేష్ గారి తాతయ్య శేషయ్య నాయుడు గారు రచయిత, తండ్రి గోపినాథ్ గారు నిర్మాత మరియు దర్శకుడిగా ఎన్నో తమిళ, తెలుగు చిత్రాలు చేసారు.అమెరికా వెళ్లి చదువుకోవాలి అక్కడే సెటిల్ అవ్వాలి అనుకొన్న సురేష్ గారు అనుకోకుండా అసిస్టెంట్ డైరెక్టరుగా,ఎడిటింగ్ అసిస్టెంట్ గ పని చేసారు.ఎవరి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో విధి ఎటు నడిపిస్తుందో తెలియదు అనటానికి నిదర్శనం సురేష్ గారి జీవితం, ఎడిటింగ్ రూమ్ నుంచి ఫిలిం క్యానులు తీసుకొని వెళుతున్న సురేష్ గారిని చూసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్ సంతాన భారతి, పి.వాసు గార్లు నిర్మిస్తున్న పన్నీర్ పుష్పాంగల్ చిత్రానికి నటీనటుల సెలక్షన్ జరుగుతుంది అని చెపితే వారిని కలిసిన సురేష్ ను లీడ్ రోల్  కు సెలెక్ట్ చేసుకున్నారు, ఆ మరుసటి రోజే భారతీరాజా గారి డైరెక్షన్ లో నిర్మిస్తున్న అళైగల్ ఓయువతిల్లై అనే మూవీ లో కూడా లీడ్ రోల్ కు సెలెక్ట్ అయ్యారు సురేష్. మళ్ళి విధి ఆడిన నాటకం, చిన్న వయసు ఏమి చేయాలో అర్ధం కానీ పరిస్థితి, ఏ సినిమా లో నటించాలి అనే సందిగ్ధం , కానీ ముందుగా కమిట్ అయిన డైరెక్టర్ సినిమా చేయటం న్యాయం అని నిర్ణయించుకున్న సురేష్, భారతిరాజా గారికి నో చెప్పి, పన్నీర్ పుష్పాంగల్ చిత్రం చేసారు, సురేష్ నో చెప్పిన సినిమా ఎదో తెలుసా, ఆ సినిమా నే తెలుగు లో కూడా పునర్ నిర్మించిన సీతాకోకచిలుక, తన స్థానం లో కార్తీక్ ను హీరో గ తీసుకున్నారు భారతీరాజా . ‘పన్నీర్ పుష్పాంగల్’ మరియు” అళైగల్ ఓయువతిల్లై “సినిమాలు తమిళ్ లో సూపర్ హిట్ అయ్యాయి సురేష్, కార్తీక్ హీరోలుగా సెటిల్ అయ్యారు,లేకుంటే అంత మంచి అవకాశం వదులుకొన్నందుకు సురేష్ గారు  జీవితాంతం పశ్చాత్తాప పడ వలసి వచ్చేది.

KIND HEARTED MANOJ !

krishna vamshi to direct ramya krishna again!