in

i will continue films after marriage, confirms nayanthara!

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార త్వరలో ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకోబోతోన్న సంగతి తెలిసిందే. అయిదేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇటీవల సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నయన్‌ పెళ్లి అనంతరం నటిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఫిలిం దూనియాలో చర్చనీయాంశంగా మారింది. దశాబ్ద కాలంగా తెలుగు, తమిళ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది నయన్‌.

కాగా ఈ మధ్య గ్లామర్‌ రోల్‌లు పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో పాటు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలా లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగింది. అంతేగాక దక్షిణాన అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర నటిగా నయన్‌ గుర్తింపు పొందింది. అయితే విఘ్నేశ్‌తో వివాహనంతరం ఆమె నటిస్తారా లేదా అనే దానిపై ఫ్యాన్స్‌ అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తను నటనను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, పెళ్లి తర్వాత తన సినీ కేరీర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని స్పష్టం చేసినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం..

megastar’s about his dream working with shankar!

Pawan Kalyan’s first look from ‘Bhavadeeyudu Bhagat Singh’ out!