
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]రా[/qodef_dropcaps] హుల్ ఇంకా పిన్ను ఈ జంట మీద దర్శక-నిర్మాతల కన్ను పడిందట. బిగ్‌బాస్ 3షోతో ఫేమ్ అయిన వీరిద్దరి జోడీతో సినిమా తీస్తే.. అది ఖచ్చితంగా హిట్ అవుతుందని.. వారి నమ్మకమట. దీంతో.. అప్పుడే కసరత్తులు కూడా స్టార్ట్ అయినట్టు సమాచారం. ఓ టీవీ ఛానెల్లో ఇంటర్య్వూ ఇచ్చిన రాహుల్‌ని.. పునర్నవితో సినిమా చేసే అవకాశం వస్తే అందులో.. మీరు హీరోగా నటిస్తారా..? అంటూ ప్రశ్నించగా.. దానికి సమాధానంగా.. రాహుల్.. ‘ఖచ్చితంగా నటిస్తాను’. అందులోనూ.. పున్నూ బేబీతో సినిమా అవకాశం వస్తే.. 100కి 110 పర్సెంట్ ఐయామ్ ‘రెడీ’ అంటూ పక్కా స్టేట్ మెంట్ ఇచ్చాడు.మొత్తానికి ఈ క్రేజీ కాంబోతో సినిమా చేసే అవకాశమే.. వస్తే.. అందుకు అవసరమైన కథ కోసం దర్శక-నిర్మాతలు అప్పుడే పాట్లు పడుతున్నారట. అలాగే.. పున్నూ కూడా రాహుల్‌తో సినిమా అనేసరికి సై అంటుందని సమాచారం.