in

i had 10 different goals before entering movies : shraddha srinath

[vc_row][vc_column][vc_column_text]

తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రద్ధా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కెరీర్‌ విషయంలో తనకు ఎన్నో ఆలోచనలు ఉండేవని చెప్పుకొచ్చిన శ్రద్ధా.. తొలుత లాయర్‌ అవ్వాలని ‘లా’లో చేరారని కానీ ఒక్కో రోజు ఒక్కో ఆలోచన వచ్చేదని చెప్పుకొచ్చింది. ఆస్ట్రోనాట్‌, న్యూస్‌ రీడర్‌, సైకోథెరపిస్ట్‌ ఇలా రోజుకో కెరీర్‌లో సెటిల్‌ అవ్వాలనే కల ఉండేదని కానీ చివరికి నటనపై దృష్టిసారించానని తెలిపింది.

మొత్తం పది రకాల కెరీర్ల గురించి ఆలోచించి.. నటన తనకు పర్‌ఫెక్ట్‌ అని ఫిక్సయ్యానని తెలిపిందీ బ్యూటీ. ఇక కెరీర్‌ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు జ్ఞాపకాల గురించి చెప్పిన శ్రద్ధా.. ‘నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఆరేళ్లు అవుతోంది. ఈ చిన్న ప్రయాణంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలు సొంతం చేసుకున్నాయి. అలాగే కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా..

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ‘ఈ అమ్మాయి ఏడాది కంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండదు’ అన్ని మాటలు వినిపించాయి. అయితే వాటికి నేను స్పందించలేను. ఇండస్ట్రీలో నిలదొక్కుకొని సమాధానం ఇవ్వాలనుకున్నా’ అంటూ విమర్శలకు సరైన సమాధనం చెప్పిందీ బ్యూటీ. ఇక నటిగా మారకముందు శ్రద్ధా చాలా లావుగా ఉండేది. అయితే మొక్కవోని ధీక్షతో భారీగా తగ్గి నాజుగ్గా మారిందీ చిన్నది.[/vc_column_text][/vc_column][/vc_row]

Venu Thottempudi To Make His Comeback With Ravi Teja’s next!

shivathmika rajashekars stuns with bold photoshoot!