నభానటేష్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్’ ఈ నెల 15న విడుదల అయ్యింది. ఈ సందర్భంగా నభా నటేష్ మాట్లాడుతూ ‘గత ఏడాది చివరలో వచ్చిన ‘సోలో బ్రతుకే..’ చిత్రం నా కెరీర్‌తో పాటు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్నిచ్చింది. ‘సోలో బ్రతుకే..’ విడుదల తర్వాత వెంటనే ‘అల్లుడు అదుర్స్’ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయా. కొత్త సినిమా విడుదలవుతుందంటే నటీనటుల్లో టెన్షన్ ఉంటుంది. ప్రస్తుతం నేను అదే స్థితిలో ఉన్నా.
అందుకే ఈ సక్సెస్‌ను ఆస్వాదించలేకపోతున్నా. ‘అల్లుడు అదుర్స్’లో స్విమ్మర్‌గా నా పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ నా క్యారెక్టర్ గురించి చెప్పగానే భయాల్ని పక్కనపెట్టి ఈత నేర్చుకున్నా. ఉదయం పూట షూటింగ్‌లను పూర్తిచేసి రాత్రి సమయంలో స్విమ్మింగ్‌లో శిక్షణకు తీసుకున్నా. ప్రస్తుతం తెలుగులో ‘అంధాధూన్’ రీమేక్‌లో నటిస్తున్నా. తెలుగులో సవాళ్లతో కూడిన పాత్రలు చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది.