in

hot beauty Rakul Preet singh to romance Ajith!

కేవలం పదేళ్ల కెరీర్‌లోనే రకుల్ ఎన్నో సినిమాల్లో మెరిసింది. సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. కానీ అంతే తొందరంగా రకుల్ కెరీర్ స్లో అవ్వడం మొదలయ్యింది. తెలుగులో అవకాశాలు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్‌కు వెళ్లింది రకుల్. కానీ అక్కడ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో రకుల్ కెరీర్‌కు పెద్ద బ్రేకే పడింది. ఇటీవల ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్లు కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే రకుల్ మాత్రం ఒకట్రెండు అవకాశాలతో నెట్టుకొస్తోంది. కానీ ఫైనల్‌గా రకుల్‌కు కూడా పాన్ ఇండియా చిత్రంలో ఛాన్స్ దక్కినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం రకుల్ చేతిలో చాలా సినిమాలు ఉన్నా.. అవన్నీ బాలీవుడ్ చిత్రాలే.

అయితే చాలాకాలం తర్వాత కోలీవుడ్‌లో అడుగుపెట్టనున్న రకుల్.. ఓ స్టార్ సినిమాలో మెరవనుంది..రకుల్ కెరీర్ ప్రారంభంలోనే కోలీవుడ్‌లో హీరోయిన్‌గా మెరిసింది. కానీ అవేవి తనకు గుర్తింపు తెచ్చిపెట్టకపోవడంతో టాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. ఇన్నాళ్లకు అజిత్‌లాంటి స్టార్ హీరో సినిమాతో మళ్లీ కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది ఈ భామ..ఇప్పటికే శివకార్తికేయన్‌తో ఒక సినిమా చేసినా.. అది విడుదల విషయంలో వాయిదా పడుతుంది. ఇక ఇప్పుడు అజిత్, హెచ్ వినోథ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో రకులే హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. అంతే కాకుండా అజిత్ ఇతర సినిమాలలాగానే ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుందని టాక్.

pooja hegde shocks producer dil raju!

Jayamma Panchayathi Trailer, Suma Kanakala!