in

Hot Beauty ketika sharma’s special song in NTR’s Dragon!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జూన్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా రుక్మిణి వసంత్, రష్మిక మందన నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కేతిక శర్మను ఫైనల్ చేశారట..

దీనికోసం కేతిక శర్మను చిత్ర బృందం సభ్యులు సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా, దీనిపై మేకర్స్ నుంచి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవలే కేతిక శర్మ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాకుండా రీసెంట్ గా ఈ చిన్నది శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమాలో హీరోయిన్ గా నటించి సక్సెస్ సాధించింది. దీంతో ఈ చిన్న దానికి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి..!!

f cube ‘naresh’!

pooja hegde about high and lows in cinema career!