in

hot beauty Disha Patani to make directorial debut!

మధ్య కాలంలో బాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా మారిన ఈ అమ్మడు ఫోటో షూట్‌ లతో సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉంటుంది. ఒక వైపు హీరోయిన్‌ గా నటిస్తూ మరో వైపు కవర్‌ పోటోలకు ఫోజ్‌ లు ఇస్తూ సందడి చేస్తున్న ముద్దుగుమ్మ దిశా పటానీ తాజాగా దర్శకత్వం కూడా చేసేందుకు సిద్ధం అయింది. క్యూన్‌ కర్‌ ఫికర్‌ అనే మ్యూజిక్‌ ఆల్బంకి దర్శకత్వం వహించింది. తన సోషల్‌ మీడియా పేజ్‌ ద్వారా ఈ మ్యూజిక్‌ ఆల్బం పోస్టర్‌ ను షేర్‌ చేసి అందరినీ సర్‌ ప్రైజ్‌ చేసింది..

సాధారణంగా ముద్దు గుమ్మలు దర్శకత్వంపై ఆసక్తి చూపించరు. సీనియర్‌ హీరోయిన్స్‌ లో కూడా చాలా మంది ఇప్పటి వరకు దర్శకత్వం చేసిందే లేదు. కానీ చిన్న వయసులోనే ఈ అమ్మడు మెగా ఫోన్‌ పట్టి దర్శకత్వం చేసింది. ఈ మ్యూజిక్‌ ఆల్బం లేడీ ఓరియంటెడ్‌ కాన్సెప్ట్‌ తో రూపొందింది. కనుక దిశా దర్శకత్వం వహించినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల సినిమాలో.. క్రేజీ సినిమాల్లో నటిస్తున్న ముద్దుగుమ్మ దిశా పటానీ ఇలా మ్యూజిక్‌ ఆల్బం లు కూడా చేస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..!!

Sunil Getting Super Busy In kollywood now!

actress rithu chowdary wants to marry naga chaithanya!