in

Chiranjeevi to Play Mafia Don in Mega 158?

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ను డిజైన్ చేశారని..ఈ ఫ్లాష్ బ్యాక్ లో భారీ మాస్ సీక్వెన్సెస్ ఉంటాయని..అందుకు తగ్గట్టు..చిరు పాత్ర పై చుట్టూ ఓ బలమైన డ్రామాను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. అన్నట్టు ఈ ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట..

మొత్తానికి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది..!!

Dil Raju’s film confirmed with salman khan and nayanthara!

Allu Arjun & Basil Joseph: Superhero Film AA25

Allu Arjun and Basil Joseph: Superhero Film AA25 Confirmed?