తెలుగు చిత్రసీమ లో సెంటిమెంట్ కు కరువు లేదు, ఏదైనా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా టైటిల్ కి ముందో, వెనుకో ఒక పదం చేర్చి టైటిల్ పెట్టేస్తుంటారు, ఆ విధంగా బాగా నలిగి పాపులర్ అయిన టైటిల్ ” ఖైదీ”. యెన్.టి.ఆర్. ఏ.యెన్.ఆర్.వారి వారసులు అయిన బాలయ్య , నాగార్జున, మరియు మహేష్ బాబు తప్ప దాదాపుగా అందరు హీరోలు, కొందరు హీరోయిన్లు కూడా “ఖైదీ” టైటిల్ తో ఉన్న చిత్రాలలో నటించారు. టైటిల్ లో ఖైదీ ఉన్న చిత్రాలు లెక్క కు లేనన్ని ఉన్నాయి. ఈ వరుసలో మొదటి చిత్రం 1962 లో వచ్చిన ” ఖైదీ కన్నయ్య” చిత్రం, ఇందులో కాంత రావు గారు హీరో.
శోభన్ బాబు హీరో గ “ఖైదీ బాబాయ్”, “ఖైదీ కాళిదాస్”, “జీవిత ఖైదీ” అనే మూడు చిత్రాలలో నటించారు..కృష్ణ గారు “ఖైదీ రుద్రయ్య” అనే చిత్రంలో నటించారు. చిరంజీవి గారి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం “ఖైదీ”, ఆ తరువాత “ఖైదీ నెంబర్ 786 ” అనే చిత్రం, చిరంజీవి గారి కం బ్యాక్ సినిమా అయిన” ఖైదీ నెంబర్ 150 “లో నటించారు. మోహన్ బాబు గారు, కృష్ణం రాజు గారి కాంబినేషన్ లో” ఖైదీ గారు “అనే చత్రం వచ్చింది. సుమన్ హీరో గ” ఖైదీ దాదా, ఖైదీ ఇన్స్పెక్టర్ “అనే రెండు చిత్రాలు వచ్చాయి..
వినోద్ కుమార్ హీరోగా “ఖైదీ నెంబర్ 1 ” అనే చిత్రం వచ్చింది, హరీష్ ని హీరో చేసిన చిత్రం” ప్రేమ ఖైదీ”. సిల్క్ స్మిత వంటి సెక్స్ బాంబు నటించిన చిత్రం “ఖైదీ రాణి”. ఖైదీ చిత్రం లో చిరంజీవి గారి సరసన హీరోయిన్ గ నటించిన మాధవి గారు “ఖైదీ నాగమ్మ” అనే చిత్రం లో నటించారు ఈ చిత్రం లో హీరో గ మురళి మోహన్ నటించారు. ఇదండీ తెలుగు చిత్ర సీమలోచాలా మంది హీరో హీరోయిన్లు ఖైదీలు గ మారిన వైనం. ఈ విధం గ ఖైదీ టైటిల్ తెలుగు చిత్ర సీమలో ఎక్కువ సార్లు ఖైదీ అయిన టైటిల్ గ చెప్పుకోవచ్చు.