ఇండస్ట్రీలో నటనే ప్రాణంగా సినిమాల్లో దూసుకెళ్లే వారుంటారు.. ఎంత ట్యాలెంట్ ఉన్నా ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్ళు కనిపిస్తారు.. పబ్లిసిటీతో అవకాశాలని పెంచుకునే ఆలోచనలోను కొంతమంది నటీనటులు ఉంటారు. ఈ సోషల్ మీడియాలో ఎరాలో ఎక్కువగా మూడవ ఫార్ములానే ఫాలో అవుతూ సెలబ్రెటీలు అయిపోతున్నారు సినీ స్టార్స్. హీరోయిన్ రేఖా భోజ్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇప్పటికే అవకాశాలు వస్తూ అడపాదడపా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న రేఖా భోజ్..
మరింత మెరుగైన అవకాశాల కోసమో.. లేక బన్నీపై అభిమానమో కానీ.. పుష్ప లోని సెన్సేషనల్ సామీ.. సామీ.. పాటకు కవర్ సాంగ్ చేసింది. అది కూడా ఎదో సాదాసీదాగా చేసింది కాదు. పుష్ప మేకింగ్ క్వాలిటీకి తగ్గకుండా… ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా.. అద్దిరిపోయే విజువల్స్ తో సాంగ్ చేసి.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది హీరోయిన్ రేఖా భోజ్. అయితే దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమహః వంటి చిత్రాల్లో నటించినా.. రేఖా భోజ్ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు.
దాంతో టాలీవుడ్ లో బన్నీకి ఉండే క్రేజ్ ని క్యాచ్ చేసుకుని..తన ట్యాలెంట్ ని ప్రేక్షకులకి చూపెట్టింది రేఖా భోజ్. ఒరిజినల్ సాంగ్ స్టాండెడ్ ని రీచ్ అవ్వాలన్న కసితో.. సామీ.. సామీ కవర్ సాంగ్ కోసం ఏకంగా తన రెండు గాజులు కూడా అమ్ముకుందట హీరోయిన్ రేఖా భోజ్. ‘చాలా కష్టపడి చేశాను.. రెండు గాజులు అమ్ముకున్నా.. మీకు నచ్చితే మీ సోషల్ మీడియాలో ఒక్క షేర్ చేసి సపోర్ట్ చేయండి’ అని పోస్ట్ పెట్టింది రేఖా భోజ్. ఈ కవర్ సాంగ్‌లో కట్టు బొట్టు, లొకేషన్స్, డ్యాన్స్ అన్నీ కూడా సరిగ్గా సరిపోవడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.