
హీరోయిన్ పూర్ణ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం.లాక్‌డౌన్ వలన స్వస్థలం కేరళలో కొద్ది రోజులుగా ఉంటుంది పూర్ణ. ఆమెని నలుగురు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా బెదిరించారు. డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వాలని అన్నారు. దీంతో పూర్ణ తన కుటుంబసభ్యులతో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో అష్రఫ్, రఫీఖ్, శరత్, రమేశ్ ఉన్నారు.ఈ నలుగురు గతంలో కూడా పలువురు సెలబ్రిటీలని బెదిరించి ఇలానే డబ్బులు డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత నలుగురికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

