చిత్ర పరిశ్రమలో హీరోలు ఎందరో!!! చివరి వరకు హీరోలుగానే కొనసాగ గలిగిన వారు కొంత మందే, చాలా మంది కాల క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి తమ కెరీర్ ని కొనసాగిస్తుంటారు. ఆలా క్యారెక్టర్ రోల్స్ చేసే వారి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు, కానీ వారు కూడా ఒకప్పటి హీరోలే, వారు కూడా అరుదయిన రికార్డులు కొన్ని సొంతం చేసుకొని ఉంటారు అన్న విషయం మరుగున పడిపోతుంది. మనం చాల సినిమాలలో పూజారి వేషం లో చూసిన రమణ మూర్తి గారు కూడా ఆ కోవకు చెందిన వారే, 1960 దశకం లో దాదాపు 27 చిత్రాలలో హీరోగా నటించారు రమణ మూర్తి గారు, ఆయనకు జరిగిన ఒక కారు ప్రమాదంలో కాలికి ఫ్రాక్చర్ కావటం తో దాదాపుగా 4 సంవత్సరాలు ఇంటికే పరిమితం కావటం తో చిత్ర పరిశ్రమ ఆయనను మర్చిపోయింది. అసలే మన తెలుగు వారిది చాల షార్ట్ మెమరీ అని పేరు ఉంది. మళ్ళీ విశ్వనాధ్ గారు తీసిన సిరి సిరి మువ్వ చిత్రంలో పూజారి వేషం లో కనిపించిన రమణ మూర్తి గారిని చూసి రమణ మూర్తి ఇంకా చిత్ర పరిశ్రమలోనే ఉన్నారా అనుకున్నారు అందరు.
ఇంకొక గొప్ప లక్షణం మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంది అదేమిటంటే ఎవరయినా ఒక క్యారక్టర్ బాగా చేసారు అంటే వారికీ వరస బెట్టి అదే తరహా క్యారెక్టర్ లు ఇవ్వటం లో మన వారు ముందుంటారు. పూజారి క్యారెక్టర్లు వేసుకుంటున్న రమణ మూర్తి ఒకప్పుడు, తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత గారి తో కలసి ఒక ఇంగ్లీష్ చిత్రంలో హీరోగా నటించారు అన్న విషయం ఎంత మంది కి తెలిసి ఉంటుంది చెప్పండి? మాజీ భారత రాష్ట్రపతి వి.వి.గిరి గారి కుమారుడు 1968 నిర్మించిన ” ది ఎపీసిల్” అనే ఇంగ్లీష్ చిత్రంలో, జయలలిత గారి సరసన హీరోగా నటించారు రమణ మూర్తి గారు. ఈ చిత్రం కేవలం తమిళ నాడు లోనే ప్రదర్శించటం తో రమణ మూర్తి గారికి దక్కవలసినంత గుర్తింపు దక్క లేదు. సినీ వినీలాకాసం లో ఎన్నో తారలు, కొన్ని మాత్రమే వెలుగులు చిందిస్తూ గుర్తింపు పొందుతాయి, మరికొన్న్ని తమ ఉనికిని చాటుకోవడానికి కూడా నోచుకోవు, అలాగే ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు కూడా అనామకం గ మిగిలి పోతుంటారు తళుకు బెళుకుల సినీ లోకంలో..!!