
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఈ [/qodef_dropcaps]ఏడాది నవంబర్‌లో హీరో రాజశేఖర్ గారి కార్ హైదరాబాద్ రింగ్ రోడ్డుపై గోల్కొండ వద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే, ఇల జరగడం అతనికి ఇది మొదటి సరి కాదు, 2017లోనూ ఆయన కారు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు ఆయన కార్ కి జరిగిన రెండు ప్రమాదాల్లో పెద్దగా గాయాలేమి తగలకుండా బైట పడ్డారు. ఇదిలా ఉండగా అతని కారుపై ఏకంగా 22 చలాన్లు ఉన్నట్లు RTA అధికారులు గుర్తించారు, అంతే కాకుండా అతని డ్రైవింగ్ లైసెన్స్ గడువు 2017 సంవత్సరంలోనే ముగిసిందని నిర్దారించారు. ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్, మోతాదుకు మించిన చలాన్లు ఉండడంతో అధికారులు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయడం జరిగింది.