
ముందుల కాకుండా ఇప్పుడు సెలెక్టివ్ సినిమాలు చేస్తున్న సమంత ‘పుష్ప’ లో లీడ్ హీరోయిన్ క్యారెక్టర్ కి న్యాయం జరుగుతుందని చిత్ర యూనిట్ భావించారట. అందులోనూ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన మైత్రీ మూవీ మేకర్స్ తో సామ్ ఓ సినిమా చేయాల్సి ఉందట. దీంతో పుష్ప పక్కన నటించమని సమంతని సంప్రదించారట.అయితే ఆమెకు పాత్ర నచ్చినప్పటికీ ఈ మధ్య సినిమా సినిమాకి వేరియషన్ కోరుకుంటున్న సామ్ ఈ సినిమాలో నటించలేనని చెప్పిందట. దీంతో అప్పటికే ‘భీష్మ’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రష్మిక ని తీసుకున్నారట. కాగా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.

