in

Here is what Pooja Hegde does to maintain her physique!

పూజా హెగ్డే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 11 ఏళ్లు అవుతుంది. అప్పుడు ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది. ఈ మాట అందరి హీరోయిన్లకు చెబుతుంటారు. ఇందులో కొత్తేముంది అంటారా? కావాలంటే ఒకసారి ‘మాస్క్’ సినిమాలో పూజను, ఇప్పుడు పూజను చూడండి. అప్పటి కంటే గ్లామర్‌ ఇంకాస్త పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే అప్పుడు, ఇప్పుడు ఆమె ఫిట్‌నెస్‌ మాత్రం ఒకేలా ఉంది. ఆ కర్వీ బాడీని చక్కగా మెయింటైన్‌ చేస్తూ వస్తోంది.

తాజాగా తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ గురించి చెప్పింది పూజా హెగ్డే. ఆమె ఫిట్‌నెస్‌ ‘పైలెట్స్ ఎక్సర్ సైజ్’ అంట. పూజ రోజులో ఎక్కువసేపు ఈ వ్యాయామమే చేస్తుందట. జిమ్‌కి వెళ్లినా, వెళ్లకపోయినా ఇంట్లోనే పైలెట్స్ సెషన్స్ చేస్తుందట. ఈ సెషన్స్‌ మిస్‌ చేసే రోజు ఉండదట. ముంబయిలో ఉన్నా, ఇక్కడ ఉన్నా రోజులో కొంత సమయం పైలెట్స్‌ కోసం సమయం కేటాయిస్తుందట. దీంతోపాటు యోగా కూడా ఎక్కువగా చేస్తుంటుందట. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లో సినిమా అవకాశాలు సంపాదిస్తోందట ఆ మాత్రం చేయాలిగా మరి.

Parul Yadav hot Stills at IIFA Utsavam Awards!

Shruti And Tamannah Exchanged tollywood Sr Star Heroes!