సినీ ప్రపంచం ఒక రంగుల ప్రపంచం, అక్కడ ఏది వారి సొంతం కాదు, అక్కడ తెర మీద కనిపించే నటి, నటుల మాటలకు వ్రాతగాళ్ళు, ఎలా నటించాలో చేసి చూపించేందుకు చేతగాళ్ళు, పాటలు పాడటానికి పాటగాళ్లు ఉంటారు, అంతే కాదు వారిని వారి శక్తి, సామర్ధ్యాల కంటే ఎక్కువ చేసి, వారిని మోసేసే, మోతగాళ్ళు ఉంటారు. అదంతా నిజమనుకొని వారెక్కడో ఆకాశం లో విహరిస్తుంటే, వారి అమ్మ, నాన్నలు ఏకంగా ఆకాశం నుంచి దిగి వచ్చినట్లు బిహేవ్ చేస్తారు. స్టార్ హోటల్ బ్రేక్ ఫాస్ట్, ఇంపోర్టెడ్ ఫ్రూట్ జ్యూస్ లు, క్యారవాన్ లు కావాలంటూ నిర్మాతల తల తింటుంటారు. హీరోకు, హీరోయిన్లకు ఒక అమ్మ ఉంటుంది, ఆమెకు నేను మొగుడిని గాబట్టి, ఆ అమ్మ గారి మాట, ఆమె మొగుడి మాట చెల్లాలి అంటారు. సాయంత్రం అయితే ఏ జానీ వాకరో, చివస్ రీగలో కావాలంటారు. ఇదంతా చాల సర్వ సాధారణం. వారిని తప్పు పట్ట వలసిన అవసరమే లేదు, ఎందుకంటె హీరోని అతని ఇమేజ్ కంటే పది రేట్లు ఎక్కువ చేసి అమ్మేసే( ఓవర్ సెల్లింగ్ గాళ్లు ) నిర్మాతలు చచ్చినట్లు భరిస్తారు, భరించాలి కూడా.
కానీ వీరందరి కంటే ప్రత్యేకమయిన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయనే అశోక్ కుమార్ గౌడ, కె.జి.ఎఫ్. హీరో యష్ వాళ్ళ నాన్న గారు, మనందరికీ తెలుసు ఇప్పుడు యష్ పాన్ ఇండియా స్టార్, మరి అశోక్ కుమార్ గౌడ , షూటింగ్లకి రారు, అంతే కాదు, కొడుకు అంత పాపులర్ హీరో అయినా తరువాత కూడా, కండక్టర్ విజిల్ వేసి రైట్ , రైట్ అనగానే ఫస్ట్ గేర్ వేసి బస్సు ను ముందుకు నడిపిస్తుంటారు. అదేనండి ఆయన కె.ఎస్.ఆర్.టి.సి. లో డ్రైవర్ గ పని చేస్తున్నారు, నేను ఇంత పెద్ద హీరోని అయ్యాను కదా నువ్వు ఉద్యోగం మానెయ్య వచ్చు కదా నాన్న అంటే, ఈ డ్రైవర్ ఉద్యోగం తోనే నిన్ను ఇంత పెద్ద వాడిని చేసింది, నువ్వు హీరోవి , నేను కాదుగా కన్నా, నా పని నన్ను చేసుకొని అన్నారట. యష్ తెర మీద హీరో అయ్యారు , కానీ ఆయన తండ్రి అశోక్ కుమార్ గౌడ నిజ జీవితం లో హీరో. ఎస్ హి ఈజ్ ది రియల్ హీరో. ఈ రోజుల్లో కూడా ఇలా ఎంత మంది ఆలోచిస్తున్నారు చెప్పండి, అశోక్ కుమార్ గౌడ గారికి పాదాభివందనం!!!