in

happy birthday suriya!

సూర్య..రోలెక్స్ సర్‌..ఇప్పుడు ఇండియా మొత్తం మారుమోగుతున్న పేరు. అందుకు ఓ కారణం ఆయనకు జాతీయ అవార్డు లభిస్తే, రెండు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అందరు హీరోలకంటే స్పెషల్‌ అనే అంశాలు వైరల్‌ అవుతున్నాయి..సూర్య ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన హీరో. తనని తాను మలుచుకుంటూ స్టార్‌ హీరోగా ఎదిగారు. కోలీవుడ్‌లో అందరు హీరోలతో పోల్చితే తాను భిన్నం అని నిరూపించుకుంటున్నారు. అందుకే ఆయన్ని ఇతర సూపర్‌ స్టార్లతో పోల్చితే ప్రత్యేకంగా నిలిపాయి. అనేక కారణాలు సూర్యని స్పెషల్‌ గా మార్చాయి. అందరి అభిమానుల మనసులను దోచాయి. ఇతర హీరోల అభిమానులను సైతం తనకు ఫ్యాన్స్ ని చేశాయి..

సూర్య కేవలం హీరోగానే కాదు, నిర్మాతగా, సింగర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, వాయిస్‌ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఇలా మల్టీఫుల్‌ వర్క్ చేసేది కోలీవుడ్‌లో కమల్‌ తర్వాత ఈ తరం నటుల్లో సూర్య ఒక్కరే కావడం విశేషం. అయితే ఏదో చేశామనేది కాకుండా అన్నింటిలోనూ సక్సెస్‌ కావడం ఆయన ప్రత్యేకత. అదే సూర్యని కోలీవుడ్‌లో ఓ స్పెషల్‌గా మార్చింది. ఇక నిర్మాతగా అనేక సందేశాత్మక, కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలను తన 2డీ ఎంటర్‌టైన్‌ మెంట్స్ ద్వారా నిర్మిస్తున్నారు. ఇటీవల సాయిపల్లవి నటించిన `గార్గి` చిత్రం నచ్చి స్వచ్ఛందంగా సమర్పకుడిగా మారడం ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్‌ని తెలియజేస్తుంది…అన్ని రంగాల్లో సూర్య మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ..వారికీ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము..!!

Raashii Khanna joins Ustaad Bhagat Singh as shloka!

Are Samantha & Raj Nidimoru Finally Official?