in

happy birthday sumanth!

యార్లగడ్డ సుమంత్ కుమార్ 1975 ఫిబ్రవరి 9న జన్మించారు..ఆయన తండ్రి యార్లగడ్డ సురేంద్ర, తల్లి అక్కినేని సత్యవతి. ఏయన్నార్ పెద్ద కూతురు సత్యవతి కుమారుడే సుమంత్. సుమంత్ పుడతాడు అన్న కొన్ని నెలల ముందుగానే ఏయన్నార్ కు హార్ట్ ఆపరేషన్ జరిగింది. దాంతో ఆయన 1975లో ఇంటివద్దనే విశ్రాంతి తీసుకున్నారు. అప్పట్లో ఆయనకు చిన్నారి సుమంత్ పెద్ద కాలక్షేపం. మనవడితో ఆడుకుంటూ మళ్ళీ హుషారుగా ‘సెక్రటరీ’ చిత్రంలో నటించారు ఏయన్నార్.

చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణం చూడటం వల్ల సుమంత్ లోనూ నటనాభిలాష ఉండేది. అయితే దానిని బయట పెట్టలేదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పదోతరగతి వరకు చదువుకున్న సుమంత్, తరువాత ఇంటర్ పూర్తయ్యాక మిచిగాన్ లో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళారు. అక్కడ రెండేళ్ళు చదివాక చికాగోలోని కొలంబియా కాలేజ్ లో బి.ఏ.ఇన్ ఫిలిమ్ స్టడీస్ చేశారు. నటనలో పట్టు సాధించిన సుమంత్, స్వదేశం వచ్చాక తాత, తండ్రి, మేనమామ ఆశీస్సులతో ‘ప్రేమకథ’ చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

అయితే మేనమామ నాగార్జున మాత్రం సుమంత్ ను హీరోగా నిలిపేంత వరకు అతనితో సినిమాలు నిర్మిస్తూనే వచ్చారు. ‘ప్రేమకథ’ తరువాత ‘యువకుడు’ తెరకెక్కించారు. అదీ అంతగా ఆకట్టుకోలేక పోయింది. తరువాత తాతతో కలసి ‘పెళ్ళిసంబంధం’లోనూ, మేనమామతో కలసి ‘స్నేహమంటే ఇదేరా’లోనూ నటించారు సుమంత్. ఆ సినిమాలు సైతం అంతగా మురిపించలేక పోయాయి. మళ్ళీ సుమంత్ తో నాగార్జున నిర్మించిన ‘సత్యం’తో అతనికి తొలి సక్సెస్ దక్కింది. సుమంత్ చెల్లెలు సుప్రియ కూడా కొన్ని చిత్రాలలో నటించారు. సుమంత్ తండ్రి సురేంద్ర “రావుగారిల్లు, శివ, కలెక్టర్ గారి అబ్బాయి, గాయం” వంటి చిత్రాలు నిర్మించారు.

WHAT A PATHETIC END!

gopichand’s heroine kavya thapar slips her tongue!