in

Happening ismart beauty for Naga Chaitanya‘s ‘Thank You’!

గ్లామర్‌ ప్రధాన పాత్రలతో అచిరకాలంలోనే యువతరం ఆరాధ్యనాయికగా మారిపోయింది నభానటేష్‌. వెండితెరపై అందాల ప్రదర్శన చేయడంలో అభ్యంతరాలు లేవని అంటోన్న  ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆమె నాగచైతన్యకు జోడీగా నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘మనం’ తర్వాత నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె  కుమార్‌ కలయికలో ‘థాంక్యూ’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది.

రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కథానుగుణంగా ముగ్గురు నాయికలకు చోటున్నట్లు సమాచారం. ఓ హీరోయిన్‌గా నభానటేష్‌ను ఎంపికచేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. దిల్‌రాజు నిర్మాణంలో ఈ చిత్రం  రూపుదిద్దుకోనున్నది. ఇటీవలే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ప్రస్తుతం తెలుగులో నభానటేష్‌ ‘అంధాధూన్‌’ రీమేక్‌లో నటిస్తోంది. నితిన్‌ ఈ చిత్రంలో  కథానాయకుడిగా నటిస్తున్నారు.

superstar Mahesh Babu Wins A Fitness Award!

Singer Komali puts an end to Saranga Dariya’s controversy!