
ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ భారీ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ కూడా ఒకటి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఈ మధ్యనే ఒకో అప్డేట్ బయటకి వస్తున్నాయి. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్స్ ఒకొక్కరిగా పోస్టర్స్ రివీల్ చేస్తుండగా..
ఇది వరకు నార్త్ హీరోయిన్స్ కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియాల పోస్టర్స్ ని మొదట విడుదల చేయగా..నెక్స్ట్ సౌత్ నుంచి స్టార్ హీరోయిన్ నయనతార పోస్టర్ ని విడుదల చేశారు. ఇక లేటెస్ట్ గా మరో హీరోయిన్ ఇటీవల కాంతార చాప్టర్ 1 తో సర్ప్రైజ్ చేసిన నటి రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని యష్ రిలీజ్ చేసాడు. మరి ఇందులో రుక్మిణి మంచి స్టైలిష్ అండ్ డైనమిక్ గా కనిపిస్తుంది. తన కెరీర్ లో ఇపుడు వరకు వచ్చిన అన్ని సినిమాలకి డిఫరెంట్ స్టైలింగ్ అండ్ ట్రెండీగా ఆమె కనిపిస్తుంది అని చెప్పాలి..!!

