దేశముదురు హీరోయిన్ హన్సిక మోత్వానీ షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనను ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో వేధించాడంటూ సంచలన విషయాన్ని చెప్పింది. తనతో డేట్‌కి రావాలంటూ తరచూ వెంటపడేవాడని వేధించే వాడని తెలిపింది. ఆ టార్చర్భరించలేక ఆ హీరోకి తగిన విధంగా బుద్ధి చెప్పినట్టు పేర్కొంది. అయితే, ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం హన్సిక వెల్లడించలేదు. దీంతో హన్సికను ఇంతలా ఇబ్బంది పెట్టిన ఆ టాలీవుడ్ హీరో ఎవరై ఉంటారని.. నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది.
ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్న హాన్సిక అక్కడే సెటిలైంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఈ అమ్మడు సినిమా అవకాశాలు అందుకుంటోంది. కోలీవుడ్ లోనూ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. దేశముదురు సూపర్ హిట్ కావడంతో హాన్సికకు తెలుగు సినిమాల్లోనూ వరుస ఆఫర్లు వచ్చాయి. టాప్ హీరోలందరితో హన్సిక నటించింది. తెలుగులో కంటే తమిళ్ లో ఎక్కువ సినిమాల్లో ఆడిపాడింది….!!