in

Hansika Motwani to marry her business partner Sohail Kathuria!

టి హన్సిక బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బైకి చెప్పేసి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయానా వెల్లడించింది. తనకు కాబోయే లైఫ్ పార్ట్ నర్ తో దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన హన్సిక..ఇటీవల జరిగిన ఓ ఇంటర్వూలో తన పెళ్లి ముహూర్తాన్ని సైతం వెల్లడించింది. డిసెంబర్ లో తాను దాంపత్య జీవితానికి ఆహ్వానం పలకనున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తన కాబోయే భర్తను పరిచయం చేసింది. చిన్ననాటి మిత్రుడు, వ్యాపార భాగస్వామి అయిన సోహైల్ ను పెళ్లాడనున్నట్టు ఈ భామ స్పష్టం చేసింది..

పారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద సోహైల్ తో దిగిన ఫొటోలను షేర్ చేసిన హన్సిక.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పారు. ఓ ఫొటోలో సోహైల్ మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఫోజ్ ఇవ్వగా.. హన్సిక దానికి సర్ ప్రైజ్ అవుతున్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు ప్రముఖులు, నెటిజన్లు.. ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజస్థాన్‌ జైపూర్‌లోని ఓ రాజకోటలో డిసెంబర్‌ 4న కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్టు సమాచారం. డిసెంబర్‌ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది..!!

south Actor Prithveeraj Confirms Dating 24 Years girl!

diagnosed Samantha Gets Support From akkineni family?