
మధుర గాయకుడు ఘంటసాల గారు గాయకుడిగా,సంగీత దర్శకుడిగా అందరికి సుపరిచితులు. ఘంటసాల గారు నిర్మాతగా మూడు సినిమాలు నిర్మించిన విషయం చాల మంది కి తెలియదు. ఘంటసాల గారు “పరోపకారం”, “సొంతవూరు” మరియు “భక్త రఘునాథ” అనే చిత్రాలు నిర్మించారు, ఆ మూడు చిత్రాలు ఆయనకు అపారమయిన నష్టాలను తెచ్చిపెట్టాయి, ఘంటసాల గారు ఆర్ధికమయిన ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు దాని మూలంగ. అంతటి నష్టాలను చవి చూపిన ఆ చిత్రాల గురించి ఎవరయినా అడిగితే, దాని గురించి బాధ పడకుండా, ఏముంది బాబు మొదటి సినిమా “పరోపకారం” పరులకు ఉపకారం అయింది, రెండవ సినిమా “సొంతవారు” తీసాక ఇక నువ్వు సొంతవూరికి వీళ్ళిపో అన్నారు జనం, ఇక మూడవ సినిమా “భక్త రఘునాథ” చుసిన జనం ఘంటసాల ఇక నువ్వు ఇంట్లో కూర్చిని భజన చేసుకో అన్నారు, అంటూ తన మీద తానే హాస్యపూరిత వ్యాఖ్యానం చేసే వారట, విన్న వారు అదేమిటండి అంత ఈజీ గ తీసుకుంటున్నారు అంటే, సీరియస్ గ తీసుకొని ఏమి చేయగలం బాబు, సినిమా పరిశ్రమకు వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, ఇక్కడే వచ్చింది ఇక్కడే పోయింది అని నవ్వేసే వారట.

