ఓఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన గుల్షన్.. సాయి పల్లవి అంటే తనకు క్రష్ అని, అయితే ఆమెకు చెప్పే సాహసం చేయలేదని తెలిపాడు. “నాకు సాయి పల్లవి అంటే చాలా క్రష్. చాలా కాలం నుంచి ఆమె అంటే ఇష్టం ఉంది. ఆమె నంబర్ కూడా నా వద్ద ఉంది. కానీ ఆమె దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పే సాహసం చేయలేదు. ఆమె వండర్ఫుల్ డ్యాన్సర్, అద్భుతమైన నటి. ఆమె అంటే నాకు క్రష్ మాత్రమే. అంతకుమించి ఏమి లేదని అనుకుంటున్నా. కొన్నిసార్లు ఆమెను చూసి ఆకర్షితుడిని అయ్యాను. కానీ ఆమె ఎంతో సమర్థురాలైన నటి. ఏదోక రోజు ఆమెతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందేమోనని ఆశిస్తున్నా. అది చాలు నేను ఆనందంగా ఉండటానికి. మిగతాది నాకు తెలియదు. ఒకవేళ మిగిలినది జరగకపోతే ఏం చేస్తాను? అని కూడా అనిపిస్తుంది. అంటూ సాయి పల్లవి అంటే తనకు ఎంతో ఇష్టమో చెప్పాడు” గుల్షన్ దేవయ్య..!!