
రావి కొండల రావు, తొలి తరం నటులలో ఇంకా నటిస్తున్న సీనియర్ యాక్టర్, వీరి సతీమణి రాధా కుమారి గారు కూడా సినిమా నటి. నిజ జీవితం లో భార్య భర్తలు అయిన చాలామంది నట దంపతులు వెండి తెర మీద కూడా భార్య భర్తలు గ నటించిన సంధర్భాలు చాలానే ఉన్నాయ్. ఉదాహరణ కు కృష్ణ, విజయనిర్మల గారు, హిందీ చిత్రసీమలో అమితాబ్, జయభాదురి వంటి వారు. కానీ వారందరికంటే ప్రత్యేకత రావికొండల రావు దంపతులకు ఉన్నది.600 వందలకు పైగా చిత్రాలలో నటించిన ఈ దంపతులు వెండి తెర మీద కూడా భార్య భర్తలు గ 112 చిత్రాలలో నటించి అరుదయిన రికార్డు సాధించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమ రికార్డు మాత్రమే కాదు, ప్రపంచ చలనచిత్ర రికార్డు, గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో ఎక్క వలసినంత విశిష్టం అయిన రికార్డు, దురదృష్టం ఏమిటంటే, దీనిని మన చిత్రసీమ కూడా పట్టించుకోలేదు.ఇప్పటికి అయిన గుర్తిస్తారని ఆశిద్దాము.

