ఇద్దరు మనుషుల మధ్య పోటీ సహజం, ఈ పోటీ ఒక్కో సారి అసూయలకు, కక్షలకు దారి తీసే ప్రమాదం కూడా చాల సాధారణం, కానీ ఆరోగ్యకరం అయిన పోటీ ఇద్దరి ఎదుగుదలకు ఉపయోగ పడుతుంది. ఇటువంటి ఆరోగ్యకరం అయిన పోటీ గత కాలపు నటుల మధ్య మనకు స్పష్టం గ కనిపించేది. ఉదాహరణకు ఎస్.వి.ఆర్., గుమ్మడి గారు ఇద్దరు ఒకే కాలం లో క్యారెక్టర్ నటులుగా కొనసాగిన వారే, వీరిద్దరి మధ్య ఎంతో ఆరోగ్యకరం అయిన పోటీ నడిచేది, ఎస్.వి.ఆర్. తన నటన తో ప్రక్కన ఉన్న నటులను తినేసే వారు, అయిన గుమ్మడి గారు తన సహజ శైలి లో నటిస్తూ ఆయన తో సమానంగా పేరు తెచ్చుకున్నారు. ఎస్.వి.ఆర్., గుమ్మడి గారు 1973 లో ఒక సారి , అమెరికా వెళ్లారు అక్కడ జరిగిన ఒక ప్రోగ్రాము లో గుమ్మడి గారిని ఎస్.వి.ఆర్. గురించి మీ అభిప్రాయం చెప్పండి అని అడిగారట.
దానికి గుమ్మడి గారు ఎస్.వి.ఆర్. అనే నటుడు హాలీవుడ్ లో పుట్టి ఉంటె ప్రపంచం గుర్తించిన అయిదు, ఆరు గురు నటులలో ఒకరిగా గుర్తింపు పొంది ఉండే వారని. హిందీ నటులు పృథ్వి రాజ్ కపూర్, ప్రేమ్ నాధ్, ఓం ప్రకాష్ వంటి దిగ్గజ నటులు ముగ్గురు కలసి ఒక మనిషిగా పుడితే అది ఎస్.వి.ఆర్. అవుతారని గొప్ప కితాబు ఇచ్చారు. ఎస్.వి.ఆర్. గురించి గుమ్మడి గారి హృదయాంతరాల నుంచి వచ్చిన ఆ మాటలకూ ఎస్.వి.ఆర్ కన్నీటి పర్యంతం అయ్యారట. బ్రదర్ నా గురించి మీకు ఇంత గొప్ప అభిప్రాయం ఉందా అంటూ చిన్న పిల్లవాడి లాగ కన్నీరు పెట్టుకున్నారట. దీనినే అంటారు ఆరోగ్యకరం అయిన పోటీ అని. తన సహా నటుడి గొప్ప తనాన్ని ఎంత నిష్కల్మషం గ చెప్పారో చూడండి గుమ్మడి గారు, అందుకే వారు గొప్ప నటులే కాకా గొప్ప మనుషులు గ గుర్తుండి పోతారు..!!