
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ద[/qodef_dropcaps] ర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంక మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో తీస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. అయితే ఈ సినిమా దర్శకుడి గురించి సెర్చ్ చేస్తే రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ పేరును చూపిస్తోంది. మరి ఈ సంజయ్ పాటిల్ ఎవరా అని ఆరా తిస్తె అతను బీజేపీ mla అని తేలింది. అయితే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు దర్శకుల పేర్లు చూపించడంపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపంచనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.