in

goa beauty ileana shocking comments!

క్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన హీరోయిన్లు.. ఇక్కడి పరిశ్రమల గురించి తక్కువ చేసి మాట్లాడటం కొత్తేమీ కాదు. ఇలియానా, తాప్సి పన్ను లాంటి వాళ్లే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ ఉన్నన్నాళ్లూ పారితోషకాల ఆశతో నో చెప్పకుండా అన్ని రకాల వేషాలూ ఒప్పుకుంటారు. తీరా బాలీవుడ్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ పడితే.. టాలీవుడ్, కోలీవుడ్ తమ ప్రతిభను గుర్తించలేదని ఏడుస్తారు. అంతటితో ఆగకుండా ఇక్కడి హీరోలు అలాంటి వాళ్లు ఇలాంటి వాళ్లు అని కామెంట్లు చేయడమూ మామూలే. తాజాగా ఇలియానా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. టాలీవుడ్లో నెపోటిజం ఛాయలు ఎక్కువ అన్న ఆమె.. ఇక్కడ అవకాశాల పేరుతో అమ్మాయిల్ని లోబరచుకోవడమూ ఎక్కువే అంది. తెలుగు పరిశ్రమలోని కొందరు అగ్ర హీరోలు, నిర్మాతలు.. హీరోయిన్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరినీ కోరిక తీర్చమని..

లేకుంటే అవకాశాలు రావని అంటారని ఇలియానా కామెంట్ చేసినట్లుగా వార్తలు కనిపిస్తున్నాయి. కొందరు అగ్ర హీరోలు సెక్స్ కావాలని నేరుగానే అడుగుతారని ఆమె అంది. ఓ కొత్త హీరోయిన్ తన దగ్గరికి వచ్చి.. అవకాశం కావాలంటే దర్శకుడు, హీరోతో పడుకోవాలట.. మరి ఏం చేయమంటారు అని తనను అడిగినట్లుగా ఇలియానా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐతే తన వరకు అలాంటి సమస్యలు లేవని.. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిసి జాగ్రత్త పడ్డానని ఆమె అంది.

nagarjuna new look for big boss!

singer sunitha warning to social media fraud!