in

goa beauty Ileana D’Cruz BANNED From kollywood?

కప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలో ఒక వెలుగు వెలిగిన కథానాయిక ఇలియానా. ముఖ్యంగా టాలీవుడ్లో ఆమె హవా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘దేవదాసు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో కథానాయికగా పరిచయం అయిన.. రెండో చిత్రానికే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో జట్టు కట్టి ఇండస్ట్రీ హిట్‌లో భాగం అయిన ఆమె.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తర్వాత ఈ గోవా బ్యూటీ తమిళంలో కూడా కొందరు టాప్ స్టార్లతో నటించింది. కానీ సౌత్‌లో కొంచెం జోరు తగ్గుతున్న టైంలో బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయిందామె.

చాలా ఏళ్ల తర్వాత తిరిగి టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చినా ఆమెకు కలిసి రాలేదు..అదే సమయంలో బాలీవుడ్లో కూడా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో తప్ప ఆమె వార్తల్లో నిలవట్లేదు. ఇలాంటి టైంలో ఇలియానాను ఒక ఫిలిం ఇండస్ట్రీలో బ్యాన్ చేశారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తమిళ సినిమాల్లో ఇలియానా నటించకుండా అక్కడి నిర్మాతల మండలి బ్యాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ తమిళ సినిమా కోసం కాంట్రాక్ట్ మీద సైన్ చేసి అడ్వాన్స్ తీసుకున్న ఇలియానా..

తర్వాత ఆ చిత్రంలో నటించట్లేదని నిర్మాత ఫిర్యాదు చేశాడు..ఈ విషయంలో ఇలియానాదే తప్పు అని తేల్చిన నిర్మాతల మండలి ఆమెపై నిషేధం విధించినట్లు చెబుతున్నారు. ఐతే ఇలియానా కెరీర్ దాదాపుగా క్లోజ్ అయిపోయాక ఆమె మీద నిషేధం విధించడం వల్ల పెద్దగా మార్పేమీ ఉండదని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిపోయాక కొన్నేళ్ల పాటు ఆమెకు మంచి ప్రయారిటీనే ఇచ్చారు అక్కడి ఫిలిం మేకర్స్. కానీ తర్వాత వాళ్లు కూడా పట్టించుకోవడం మానేశారు..!!

‘khiladi’ girl dimple hayathi finally gets her second telugu film!

41 years for ‘Kaliyuga Ramudu’!