in

glam doll Ananya Pandey interesting comments on her ‘liger’ costar!

పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న చిత్రం.. లైగ‌ర్‌. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను వేగంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే సినిమా విడుద‌ల‌కు చాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఈ మూవీకి ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు. అందులో భాగంగానే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేలు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ఇందులో రౌడీ విజయ్ పై నాటి కామెంట్స్ చేసింది హీరోయిన్ అనన్య..ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ..

‘ విజయ్ దేవరకొండ తెరపై కనిపించేదానికి పూర్తి భిన్నంగా బయట ఉంటారని, అంతేకాదు.. అతడు సహజంగా పిరికివాడు అని కూడా అనేసింది అనన్య. ఆయనతో నటించడం చాలా సరదాగా ఉంటుందని, ఓ నటిగా తనకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చిన వ్యక్తి విజయ్ అని ఆమె పేర్కొంది. ఆయన నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూశానని, ఆ మూవీ చాలా నచ్చిందని చెప్పిన అనన్య.. సినిమాలోని ఆ క్యారెక్టర్‌కి, విజయ్ దేవరకొండ రియల్ క్యారెక్టర్‌కి అసలు పొంతనే ఉండదు’ అని ఆమె చెప్పడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే లైగర్‌ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Rashmi Gautam at V Cinema Studio Movie Opening!

‘GOD FATHER’ and ‘BHEEMLA NAYAK’ visit each other’s film sets!