in

Girls will agree Vijay Deverakonda is really hot : sara ali khan

అత్రంగి’ ప్రమోషన్స్ సందర్భంగా , సారా అలీ ఖాన్ బాలీవుడ్ హంగామాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘అత్రంగి రే’ లోని పాత్రను పోషించడం గురించి, ఆ సమయంలో ఆమె పొందిన అనుభవం మరియు దేశం కోసం సినిమాలు చేయడం గురించి సుదీర్ఘంగా మాట్లాడింది. అత్రంగి రే సినిమాలో తన అనుభవం గురించి సారా మాట్లాడుతూ, “ఇది ఒక అద్భుతమైన అభ్యాస అనుభవం.

నేను ఎక్కడ నుండి చదువుకున్నా లేదా వచ్చి ఉన్నా, చివరికి నేను నా దేశం కోసం సినిమాలు చేస్తానని పేర్కొంది. నేను భారతీయ ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తానని పేర్కొంది. భారతీయ ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. “నేను భారతీయురాలిగా ఉన్నందుకు ఎప్పుడూ గర్వపడుతున్నానన్న ఆమె కొన్నిసార్లు ఇంగ్లీషులో, హిందీలో సంభాషించినా ఈ విషయాలు నాకు భిన్నమైనవి మరియు కష్టమైనవి కావు లేదా ప్రస్తావించ దగినవి కావని పేర్కొంది.

నేను సినిమా మొత్తంలో బలమైన యాసతో బీహారీ అమ్మాయిగా నటిస్తున్నాను, అందుకు తగిన శిక్షణ తీసుకున్నాను. ధనుష్ తరువాత మీరు ఏ సౌత్ సూపర్ స్టార్ తో నటించాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా…ఆమె తడుముకోకుండా విజయ్ దేవరకొండ అని పేర్కొంది. అయితే ఆయన చాలా కూల్ కదా అంటే అవును అని అంటూనే, ఇన్ ఫాక్ట్ కూల్ కంటే ఎక్కువ హాట్ అని పేర్కొంది. అవును నేను ఒప్పుకుంటాను, అంటే చాలా మంది అమ్మాయిలు అదే ఫీల్ అవుతూ ఉంటారని ఆమె పేర్కొంది.

Samantha wins her fifth Filmfare Award!

Krithi Shetty In Sushmita Konidela’s Female-Centric Film!