
మణిరత్నం గారి గీతాంజలి సినిమా హీరోయిన్, గిరిజ గుర్తున్నారా ?ఆవిడా అసలు పేరు గిరిజ షెట్టర్, ఆవిడ బ్రిటిష్ ఇండియన్ సంతతి కి చెందిన అమ్మాయి, గీతాంజలి మూవీ సరదాగా చేసారు అదే టైం లో మోహన్ లాల్ గారితో” వందనం ”అనే మలయాళ సినిమా కూడా చేసారు.గీతాంజలి సినిమా తరువాత ఆవిడ తెలుగులో హృదయాంజలి అనే సినిమా చేసారు, ఆ సినిమా 1992 లో షూటింగ్ పూర్తి చేసుకొని, చాల ఆలస్యంగ, 2002 లో రిలీజ్ అయి 4 నంది అవార్డ్స్ గెలుచుకుంది, హృదయాంజలి కి ముందు” జో జీత ఓహి సికందర్” అనే హిందీ సినిమా లో అమీర్ ఖాన్ ప్రక్కన నటించే అవకాశం దక్కింది, ఎందుకో మధ్యలో ఆ సినిమా నుంచి తప్పుకొన్నది, దాని గురించి ఒక సారి సినీ జర్నలిస్ట్ బి.కే. ఈశ్వర్ గారు మరి, మరి అడిగితే చెప్పిన విషయం ఏమిటంటే, స్క్రిప్ట్ లో లేని సీన్స్, అవికూడా కొన్ని అభ్యంతరకరమయిన సీన్స్ చేయమన్నారట తాను అందుకు ఇష్టం లేక తప్పుకున్నాని చెప్పారట. నిర్మాతలు ఈమె ను కోర్ట్ కు లాగారు అయినా ధైర్యం గ కోర్ట్ కేసు ఎదుర్కొని విజయం సాధించింది. నేను డబ్బు కోసం సినిమా లో నటించటం లేదు, నాకు ఆత్మ సంతృప్తిని ఇచ్చే పనులే నేను చేస్తాను, ఆత్మ సంతృప్తి లేని డబ్బు నాకు అవసరం లేదు అని చెప్పారట. ఎంత ఉన్నతమయిన భావాలూ కల వ్యక్తిత్వమో ఆమెది చూడండి. అందరు ఈ విధం గ ఆలోచిస్తే మనవాళ్ళు కూడా ఆస్కార్ స్థాయి సినిమా లు తీసే వారు. ఆ తరువాత తాను బ్రిటన్ వెళ్లి పోయి తనకు ఇష్టమయిన వృత్తి లో సెటిల్ అయ్యారు. మళ్ళీ సినిమాలలో నటించలేదు.

