అల్లు అరవింద్ ఇంటికి జీహెచ్ఎంసీ నోటీసు!
గతంలో అల్లు అర్జున్ ‘పుష్ప-2’ రిలీజ్ సమయంలో తెలంగాణ సర్కార్‌తో ఎలాంటి వివాదం నడిచిందో అందరికీ తెలిసిందే..ఇక ఇప్పుడు అల్లు అరవింద్ ఇంటిని కూల్చేస్తామంటూ జీహెచ్ఎంసీ నోటీసులు పంపడం హాట్ టాపిక్‌గా మారింది..జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లో అల్లు అరవింద్ నిర్మించిన అల్లు బిజినెస్ పార్క్‌కు కేవలం నాలుగు అంతస్తుల అనుమతి మాత్రమే ఉందని..
GHMC issues notice to Allu Business Park!
‘అల్లు బిజినెస్ పార్క్’ కు నోటీసు ఇష్యూ చేసిన జీహెచ్ఎంసీ!
అల్లు ఫ్యామిలీలో ఇటీవల విషాదం నెలకొంది. లెజెండరీ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మృతిచెందారు. ఆమె పెద్దకర్మను కూడా కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ విషాదం నుంచి ఇంకా బయటకు రాని అల్లు ఫ్యామిలీకి జీహెచ్ఎంసీ అధికారులు మరో షాక్ ఇచ్చారు..
అక్రమ నిర్మాణానికి అల్లు అరవింద్ కు జీహెచ్ఎంసీ నోటీసు!అయితే, వారు ఓ పెంట్ హౌస్ కూడా నిర్మించారని అధికారులు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఈ పెంట్ హౌస్ నిర్మించారని..దానిని ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు. మరి దీనిపై అల్లు ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి..!!