పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టార్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. సినిమా షూట్‌లో పవన్ కూడా చేరిపోయారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రియాంక ఈ సినిమాలో నటిస్తుందని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. గ్యాంగ్‌లీడర్, శ్రీకారం, డాక్టర్, డాన్ వంటి సినిమాలతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఇప్పుడు పవన్‌కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు..!!