
పూరి జగన్నాథ్ , విభిన్నమయిన డైరెక్టర్, ఆయన డైరెక్టర్ అయిన విధం కూడా విభిన్నంగానే ఉంటుంది,రాంగోపాల్ వర్మ ఫ్యాక్టరీ లో అసిస్టెంట్ డైరెక్టర్ గ మొదలయిన పూరి జగన్నాథ్ గారి ప్రయాణం లో, అయన డైరెక్టర్ గ మారేందుకు 6 నెలలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెక్రటరీ చుట్టూ తిరిగిన పూరి, చిన్న ట్రిక్ ప్లే చేసి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ పట్టేశారు. కెమరామెన్ శ్యామ్ కే నాయుడు, పూరి కి మంచి స్నేహితుడు, అయన బ్రదర్ ఛోటా కే నాయుడు కి పవన్ గారికి ఉన్న స్నేహం ద్వారా పవన్ అపాయింట్మెంట్ సంపాదించాలి అనుకున్న పూరి గారు, శ్యామ్ గారితో ఛోటా గారికి విషయం చెప్పారు, పవన్ అపాయింట్మెంట్ కావాలి అంటే ముందు తనకు స్టోరీ చెప్పి, తనకు నచ్చితే అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అని కండిషన్ పెట్టారు ఛోటా గారు.తన వద్ద సిద్ధంగా ఉన్న” ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” స్టోరీ వినిపించారు చోట గారికి స్టోరీ లైన్ నచ్చిన ఛోటా గారు పవన్ గారి అపాయింట్మెంట్ ఇప్పించారు.ఉదయం 4 గంటలకు రమ్మన్నారు, వెళ్లిన పూరి కి ౩౦ మినిట్స్ టైం ఇచ్చ్చారు పవన్ గారు, కానీ తాను చెప్పాలి అనుకున్న స్క్రిప్ట్ కి టైం కావాలి అని, తాను చెప్పటం స్టార్ట్ చేసి, పవన్ గారికి నచ్చక పోతే డోర్ ఓపెన్ చేస్తే వెళ్లి పోతాను అని చెప్పి, తన దగ్గర ఉన్న” బద్రి” స్టోరీ చెప్పటం స్టార్ట్ చేసారు, ౩౦ మినిట్స్ టైం ఇచ్చిన పవన్ గారు 4 గంటలు అలాగే ఆ స్టోరీ వింటూ ఉండిపోయారు, చివరకు క్లైమాక్స్ మార్చి, మళ్ళీ కలవ మన్నారు. రెండు, మూడు క్లయిమాక్స్ లు అనుకున్న పూరి నెక్స్ట్ డే పవన్ గారికి మొదటి క్లైమాక్ నే మళ్ళీ వినిపించారు, మళ్ళీ అదే క్లైమాక్స్ విన్న పవన్, కారణం అడిగారు ఆ స్టోరీ కి ఆ క్లైమాక్స్ అప్ట్ గ ఉంటుంది అని చెప్పిన పూరి ని మెచ్చుఁకొని, నేను అడిగానని క్లైమాక్స్ మారుస్తావా లేదా చూద్దామని నీకు టెస్ట్ పెట్టాను నువ్వు క్లైమాక్స్ మార్చి ఉంటె నేను యాక్సప్ట్ చేసి ఉండే వాడిని కాదని చెప్పిన పవన్ గారు,వెంటనే త్రివిక్రమ రావు గారికి ఫోన్ చేసి మూవీ గురించి చెప్పి, డైరెక్టర్ గ పూరి జగన్నాథ్ పేరు చెప్పి వెళ్లి ఆయనను కలవమని చెప్పారు. మొదట ఛోటా గారికి చెప్పినది ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, పవన్ గారికి చెప్పిందేమో బద్రి, తాను ప్లే చేసిన ఈ ట్రిక్ మూలంగా పూరి గారికి డైరెక్షన్ అవకాశం దక్కింది.వచ్చిన అవకాశం ను సద్వినియోగం చేసుకొని, బద్రి మూవీ ని సూపర్ గ తీశారు పూరి, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది ఈ మూవీ, పవన్ కరీర్ కి ఒక కొత్త ఊపును ఇచ్చింది ఈ మూవీ.

