తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ మేనియా మొదలైంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా..స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. తాజాగా, గేమ్ చేంజర్ కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. ఈ సినిమాలో 5 పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశారు..
ఈ పాటల ట్యూన్లు, సంగీతం, లిరిక్స్, కొరియోగ్రఫీ, విజువల్స్, ఇలా అన్నీ దేనికదే ప్రత్యేకంగా ఉండేటట్టు దర్శకుడు శంకర్ ఓ ట్రీట్ లో రూపొందించాడు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా ప్రతి ఫ్రేమ్ గ్రాండియర్ గా ఉండేందుకు తమవంతు సహకారం అందించారు. ‘జరగండి’ అనే పాట కోసం 70 అడుగుల ఎత్తు ఉన్న కొండ… దానిపై విలేజ్ సెట్ వేసి కళ్లు చెదిరే రీతిలో 600 మంది డ్యాన్సర్లతో 8 రోజులు చిత్రీకరణ జరిపారు..!!