శ్రియా శరణ్ ఇండస్ట్రీకొచ్చి ఈ నెలతో ఇరవయ్యేళ్లు పూర్తవుతోంది. అందుకే ఈ నెల 10న రిలీజవుతున్న ‘గమనం’ ఆమె కెరీర్‌లో ప్రత్యేకం..కొన్నాళ్లుగా సినిమాల పట్ల నా పర్‌స్పెక్టివ్ మారింది. నా కూతురితో సహా నా ఫ్యామిలీ అంతా చూసి గర్వపడే సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఏ పాత్ర పోషించినా అది నా మనసుకు నచ్చాలి. ఈ కథ వినగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. కచ్చితంగా నటించాలని ఫిక్సయ్యాను. మనిషి లోపలి కాన్‌ఫ్లిక్ట్, జర్నీ గురించి చెప్పేదే ఈ ‘గమనం’.
నిస్సహాయతతో ఉన్న మనిషికి ఒక్కసారిగా బలం వస్తే అడ్డంకులన్నీ దాటేస్తారు. డెలివరీ టైమ్‌లో నాకలాంటి భయం ఉండేది. ఏం కాదని ధైర్యం తెచ్చుకున్నాను. అంతా సాఫీగా సాగింది. అందరి జీవితాల్లోనూ అలాంటి ఓ పరిస్థితి వస్తుంది. ఎలా బయటపడ్డామన్నదే మన గమనం. కమల అనే పాత్ర నాది. తనకి వినిపించదు కానీ మాట్లాడగలదు. డెఫ్ అండ్ డమ్ స్కూల్స్‌కి వెళ్లి, అన్నీ చూసి తెలుసుకున్నాను. ఈ క్యారెక్టర్ కోసం బట్టలు కుట్టడం కూడా నేర్చుకున్నాను.
నేనో రూమ్‌లో ఇరుక్కుంటాను. దాన్నుంచి బయటకు రావడమే నా సక్సెస్.
ఇలాంటి క్యారెక్టర్ చేయడం హ్యాపీగా ఉంది. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా కాదు. ఇన్స్పైర్ చేసే మూడు కథలుంటాయి. షూటింగ్ టైమ్‌లో నా ఫ్రెండ్ చనిపోయారు. ఆ బాధలోనే షూటింగ్ చేశాను. ఇతర భాషల్లో చేశాను కానీ తెలుగులో లేడీ డైరెక్టర్‌తో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. లేడీ డైరెక్టర్స్‌తో పని చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది. పిల్లలు పుట్టాక ప్రపంచమే మారుతుంది. మనలో మార్పులు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. నా సినిమాలు చూసి ఇలాంటివి ఎందుకు చేశావ్ అని నా కూతురు అనకూడదు. అందుకే ఇకపై చాలెంజింగ్ పాత్రలే చేస్తాను.