ఐశ్వర్యా రాయ్ పై పాక్ మాజీ సీమర్ అబ్దుల్ రజాక్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పాడు. ‘నిన్న ఓ కార్యక్రమంలో పాక్ క్రికెట్ విధానాలు, శిక్షణపై మాట్లాడాను. నోరుజారి ఐశ్వర్యారాయ్ పేరు ప్రస్తావించాను. ఇందుకు ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్నాను. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేద’ని అన్నాడు. రజాక్ వ్యాఖ్యలను షోయబ్ అక్తర్ ఖండించాడు. ‘రజాక్ పక్కనే కూర్చున్న ఆఫ్రిదీతో మాట్లాడాను.
రజాక్ మాట్లాడింది నాకర్ధం కాలేదు. లేదంటే అక్కడే ఖండిచేవాడినన్నాడు. ఘటనపై ఆఫ్రిదీ క్షమాపణలు చెప్పా’డని అన్నాడు. ఆఫ్రిదీ స్పందిస్తూ.. ‘రజాక్ ఏదొకటి మాట్లాడి తిట్లు తినడం కొత్తేమీ కాదు. క్లిప్ చూసి క్షమాపణలు చెప్పాలని మెసేజ్ చేసా’నని అన్నాడు. రజాక్ వ్యాఖ్యలకు ఉమర్ చప్పట్లు కొట్టడంపై విమర్శలు రావడంతో..‘చప్పట్లు కొట్టడానికి.. సమర్ధించడానికి తేడా ఉంది. రజాక్ మాట్లాడింది నైతికంగా తప్పే. నేను అతడిని సమర్ధించలేదు. అనవసరంగా ఇతరులను వివాదంలోకి లాగార’ని అన్నాడు.