తెలుగులో తోలి పాన్ ఇండియన్ హీరో యెన్.టి.ఆర్. ఈ మధ్య కాలంలో లో తెలుగు చిత్ర సీమలో మనం ఎక్కువగా వింటున్న మాట పాన్ ఇండియన్ మూవీ, పాన్ ఇండియన్ హీరో. పాన్ ఇండియన్ మూవీ అనగానే మనకు గుర్తు వచ్చే సినిమా “బాహుబలి” కానీ, ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం అంటే 1953 లోనే యెన్.టి.ఆర్. ఆ రికార్డు ను తన సొంతం చేసుకున్నారు. ” చండి రాణి “అనేచిత్రం తెలుగు,తమిళ్ మరియు హిందీ భాషలలో, భరణి స్టూడియోస్ వారు నిర్మించటం, అందులో యెన్ టి.ఆర్ గారు మూడు భాషల్లోనూ హీరో గ నటించటం జరిగింది..
ఆ విధం గ తొలి పాన్ ఇండియన్ హీరో గ యెన్.టి.ఆర్. చరిత్ర సృష్టించారు…1953 ఆగష్టు 28 ఈ చిత్రం 130 ప్రింట్స్ తో రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ లో ముందు హీరో దిలీప్ కుమార్ ని అనుకున్నారు కానీ ఆయన మద్రాసు వచ్చి నటించటానికి విముఖత చూపటం తో మూడు భాషల్లోనూ యెన్.టి.ఆర్. గారే హీరో గ నటించటం జరిగింది. ఈ చిత్ర నిర్మాత అయిన భానుమతి గారు, చండి, రాణి అనే డ్యూయల్ రోల్ లో యెన్.టి.ఆర్. సరసన నటించారు. హిందీ చిత్రం కోసం అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన అడ్వాన్సులతో భరణి స్టూడియోస్ నిర్మాణం పూర్తి చేసారు భానుమతి గారు..