in

fake call chesi college bundh cheinchina sharwanand!

ర్వానంద్ చాల మృదుస్వభావి లాగా, మన పక్కింటి కుర్రాడిలాగా కనిపిస్తారు, కానీ మనకు తెలియని ఒక అల్లరి కుర్రాడి కోణం కూడా ఉంది, పక్కింటి కుర్రాడు అయినంత మాత్రాన అల్లరి చేయకూడని రూల్ ఏమి లేదు కదా. శర్వానంద్ 1 వ క్లాస్ నుంచి 10 వ క్లాస్ కి వచ్చేసరికి 7 స్కూల్స్ మారారు, అదేదో వారి నాన్న గారి ట్రాన్సఫర్స్ వలన వేరే, వేరే స్కూల్స్ మారారు అనుకొంటే పప్పులో కాలేసినట్లే. హైదరాబాద్ లోనే 7 స్కూల్స్ మారారు అది మనవాడి అల్లరి రేంజ్. ఇక కాలేజీ కి వచ్చాక ఎప్పుడు లేట్ గ వెళ్ళటం మొదటి పీరియడ్ బంక్ కొట్టడం చాలా కామన్, ఒక రోజు ఏ.బి.వి.పి. స్టూడెంట్ యూనియన్ వారు బంద్ చేస్తూ సిటీ లోని అన్ని కాలేజీ లు మూయించారు, కానీ శర్వానంద్ చదువుతున్న కాలేజీ మాత్రం మూయలేదు, చివరకు శర్వానంద్ చొరవతో మూతపడింది, ఎలాగో తెలుసా కాలేజీ ఎదురుగ ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి వాళ్ళ ప్రిన్సిపాల్ కు ఫోన్ చేసి, మేము ఏ.బి.వి.పి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము, సిటీ లో అన్ని కాలేజెస్ బంద్ చేసారు, మీకు ఒక గంట టైం ఇస్తున్నాము కాలేజీ బంద్ చేయండి, లేకుంటే మీ కాలేజీ విండోస్ అద్దాలు ఒక్కటి కూడా మిగలవు అని వార్నింగ్ ఇచ్చేసరికి, ఆ ఫేక్ కాల్ ని నమ్మిన ప్రిన్సిపాల్ కాలేజీ లాంగ్ బెల్ కొట్టించేశారట. ఎటువంటి టెన్షన్ లేకుండా ఒక ఫోన్ కాల్ తో కాలేజీ బంద్ చేయించిన శర్వానంద్ ప్లానింగ్ సూపర్బ్ కదా. ఆ వయసు అటువంటిది ఆ మాత్రం అల్లరి చేయకపోతే ఎలా, లైట్ తీసుకోండి.

rakul demanding 1cr for stage shows?

f cube ‘balakrishna’!