in

Fahadh Faasil undergone prosthetic to look bald-headed in Pushpa!

ప్పటికే తమిళంలోనూ సినిమాలు చేసి సత్తా చాటుకున్న ఫాహద్.. ఇప్పుడు తెలుగులోకి కూడా అడుగు పెడుతున్నాడు. ఇక్కడ అతడి అరంగేట్ర మూవీనే అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్, సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్‌తో కావడం అందరినీ ఎగ్జైట్ చేస్తోంది. ‘పుష్ప’లో అతనే విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ రోజే ఫాహద్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారీ చిత్రం నుంచి.

షెకావత్ అనే నార్త్ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఫాహద్ కనిపించనున్నాడీ చిత్రంలో. ఫస్ట్ లుక్‌లో ఫాహద్ గుండుతో కనిపించడం విశేషం. తెలుగులో చేస్తున్న తొలి సినిమాలోనే గుండుతో కనిపించే సాహసం చేయడం ఫాహద్‌కే చెల్లింది. పాత్రల కోసం గుండు చేయించుకునేవాళ్లు అరుదుగా ఉంటారు. ఫాహద్ కమిట్మెంట్‌కు ఇది నిదర్శనం అంటూ అతణ్ని పొగిడేస్తున్నారు నెటిజన్లు.

ఐతే ఫాహద్ అవసరమైతే గుండు చేయించుకునే రకమే కానీ.. ‘పుష్ప’ కోసం అతను ఆ సాహసం చేయలేదు. ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా ఫాహద్‌ను గుండు లుక్‌లోకి తీసుకొచ్చారు. నిజం గుండే అనిపించేలా భ్రమ కల్పించారు. ఫాహద్‌కు వేరే కమిట్మెంట్లు చాలా ఉండటంతో గుండు కొట్టించుకోవడానికి ఇబ్బంది అయింది. దీంతో మేకప్ ద్వారా మేనేజ్ చేయడానికి సుక్కు ఓకే అన్నాడు. ఐతే ఫాహద్ ప్రతిభ గురించి తెలిసిన వాళ్లు సినిమాలో అతడి లుక్‌ను మించి అతడి హావభావాలు హైలైట్ అవుతాయని ఆశిస్తున్నారు.

After Ariyana, RGV comes with Bold Avatar With Ashu Reddy!

ismart girl Nidhi Agarwal New Photoshoot!