in

FAHADH FAASIL in VENKATESH-ANIL RAVIPUDI’s film?

సాధారణంగా ఫహద్ ఫాజిల్ తెలుగులో ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్ లేదా నెగిటివ్ రోల్స్‌లోనే కనిపించారు. అయితే, అనిల్ రావిపూడి తన చిత్రాల్లో నటుల నుంచి అద్భుతమైన కామెడీని, యూనిక్ బాడీ లాంగ్వేజ్‌ను రాబట్టడంలో సిద్ధహస్తుడు. వెంకటేష్ సినిమాలో ఫహద్ పాత్ర కేవలం విలనిజానికే పరిమితం కాకుండా..హాస్యం, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్‌తో చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం. ఇటీవల అనిల్ రావిపూడి మలయాళంలో ఫహద్‌ను కలిసి కథ వినిపించారని..

స్క్రిప్ట్ నచ్చడంతో ఫహద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. మలయాళంలో ఫహద్ నటించిన ‘ఆవేశం’ చిత్రం ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యింది. అందులో ఆయన చేసిన రంగా పాత్ర తరహాలోనే, తెలుగులో కూడా ఆయన నటనకు తగ్గ పవర్ ఫుల్ క్యారెక్టర్ పడితే రేంజ్ మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్పలో ఆశించిన స్థాయి పాపులారిటీ దక్కలేదనే టాక్ ఉన్న నేపథ్యంలో, వెంకీ – అనిల్ రావిపూడి సినిమా ఫహద్‌కు టాలీవుడ్‌లో గట్టి బ్రేక్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు..!!

Dhurandhar beauty Sara Arjun to play Chiranjeevi’s daughter?

Samyuktha Menon Action Avatar in “The Black Gold”!