F2 ‘ సినిమాతో ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. ఆ తరువాత వ్యక్తిగత కారణాల వలన ఆమె తన కెరియర్ ను కొనసాగించాలా..లేదా అనే ఒక డైలమాలో పడిపోయింది. కెరియర్ ను కొనసాగించాలానే నిర్ణయానికి రావడంలో ఆమె ఆలస్యం చేసింది. ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చిన తరువాత పుంజుకోవడం చాలా కష్టమవుతుందనే సత్యాన్ని చాలామంది అనుభవపూర్వకంగా చెప్పేమాట. మెహ్రీన్ విషయంలోనూ అదే జరిగింది.
అయితే మెహ్రీన్ చకచకా తేరుకునే దిశగా అడుగులు వేసింది. ‘మంచిరోజులొచ్చాయి’ వంటి చిన్న సినిమాను సైతం చేసింది. కానీ అప్పటికే చాలామంది కొత్త హీరోయిన్స్ దూసుకుని వచ్చేశారు. అందువలన మెహ్రీన్ కి తాను వదిలేసిన ప్లేస్ దొరకడం కష్టమే అయింది. కొత్త ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపించడం లేదు. ఇతర భాషల్లోను సందడి కనిపించడం లేదు. మెహ్రీన్ ఏమైపోయిందబ్బా? అనుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో శోధిస్తున్నారు..!!