FACT 01:
సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య ‘పద్మావతి’ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ ‘వై. సత్యారావు’ని చెబుతారు.
FACT 02:
ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమా పేరుతోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది
FACT 03:
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని’..అని పాట పాడే ప్రభావశీలమయిన పాత్రలో తను వ్రాసి మొదటిసారి నటించారు కూడా..